Kamal Haasan: సినిమాల్లో గిరాకీ లేదనే కమల్ రాజకీయాల్లోకి: తమిళ మంత్రి రాజేంద్ర బాలాజీ

  • 65 ఏళ్లు వచ్చాక గానీ కమల్‌కు రాజకీయ పరిజ్ఞానం రాలేదు
  • వడివేలు వచ్చినా జనం ఎగబడతారు
  • కమల్ పార్టీకి జనం ఓట్లు వేయరు

తమిళ సూపర్ స్టార్ కమల హాసన్‌పై తమిళ మంత్రి రాజేంద్ర బాలాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒట్టపిడారం అన్నాడీఎంకే అభ్యర్థి మోహన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న మంత్రి పుదియంపుత్తూరు శ్రీనివాసన్‌ నగర్‌లో అన్నాడీఎంకే బూత్‌ ఏజెంట్లు, నిర్వాహకులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో గిరాకీ తగ్గడం వల్లే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. 65 ఏళ్ల తర్వాత కానీ ఆయనకు రాజకీయ పరిజ్ఞానం రాలేదన్నారు. సినిమాల్లో ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేశారని, ఇప్పుడు మార్కెట్ లేకపోవడంతో రాజకీయాలవైపు దృష్టి సారించారని అన్నారు. జనం ఎవరొచ్చినా చూసేందుకు ఎగబడతారని, వడివేలు వచ్చినా అంతే జనం వస్తారని అన్నారు. కమల్‌ను చూసేందుకు వస్తున్న జనం ఓట్లు మాత్రం వేయరని పేర్కొన్నారు. ఒట్టపిడారం ప్రజలు అన్నాడీఎంకే అభిమానులని, ఈ ఎన్నికల్లోనూ రెండాకుల గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థి మోహన్‌ను గెలిపిస్తారని బాలాజీ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News