keerthi suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున సినిమాలో కీర్తి సురేశ్!
  • ఎన్టీఆర్, చరణ్ షూటింగుకి రెడీ 
  • తమిళ చిత్రంలో అనూ ఇమ్మానుయేల్

 *  నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా 'మన్మథుడు 2' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఆమధ్య చరణ్, ఇటీవల ఎన్టీఆర్ షూటింగులో గాయపడడంతో ఈ చిత్రం షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో షూటింగును ఆరంభిస్తున్నారు.  
*  తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న కథానాయిక అనూ ఇమ్మానుయేల్ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలో అనూ కథానాయికగా నటిస్తుంది.

More Telugu News