రంజాన్ మాసం ప్రారంభం.. ముస్లింలకు మోదీ శుభాకాంక్షలు

07-05-2019 Tue 06:31
  • పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
  • రంజాన్ మాసం సోదర భావాన్ని సామరస్యాన్ని పెంపొందించాలి
  • సౌదీ జైళ్లలోమగ్గుతున్న వారికి విముక్తి -మోదీ

ఆకాశంలో నెలవంక కనిపించడంతో సోమవారం రంజాన్ నెల ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్‌ పర్వదినంలోగా వదలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.