Chandrababu: రేపు సుప్రీంకోర్టులో వీవీ ప్యాట్ల లెక్కింపు పిటిషన్ పై విచారణ... హాజరుకానున్న చంద్రబాబు

  • చంద్రబాబు సహా 21 మంది విపక్ష నేతలు సుప్రీంలో పిటిషన్
  • ఈ రాత్రికి చంద్రబాబు ఢిల్లీ పయనం!
  • ఢిల్లీలో విపక్షనేతలు సమావేశమయ్యే అవకాశం!

ఈవీఎంలను కొన్ని పద్ధతుల ద్వారా ప్రభావితం చేసి ఓట్లను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు గతకొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే, 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటూ ఆయనతో పాటు 21 మంది ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, దానిపై రేపు విచారణ జరగనుంది. విచారణకు హాజరయ్యేందుకు చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు.

రేపు సుప్రీం కోర్టులో జరిగే విచారణ తీరుతెన్నులను చంద్రబాబు, ఇతర నేతలు ప్రత్యక్షంగా గమనించనున్నారు. అత్యున్నత న్యాయస్థానం జరిపే విచారణ అనంతరం విపక్ష నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని తెలుస్తోంది. గతంలో, అసెంబ్లీ స్థానంలోని ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.

More Telugu News