Harish Shankar: మమ్మల్ని విమర్శించే ముందు.. ఇలాంటి వాటికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు: హరీశ్ శంకర్

  • కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని తెలుసు
  • విరాళాలు సేకరించేందుకు వేశామని తెలుసుకోండి
  • మా సినిమాల రివ్యూలు స్వేచ్ఛగా రాసుకోండి

తెర వెనుక ఉండే దర్శకులు కెమెరా ముందుకు వచ్చారు. స్కిట్ వేశారు. కానీ ఆ స్కిట్‌ను విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ కథనం రాయడం చర్చనీయాంశంగా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని దర్శకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు దర్శకుల సంఘం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ స్కిట్ వేశారు. దీనిని విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ కథనం రాసింది. దీనిపై హరీశ్ ఫైర్ అయ్యారు.

‘డియర్‌ వెబ్‌సైట్‌.. దర్శకులుగా మేం కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని మాకు తెలుసు. కానీ మమ్మల్ని విమర్శించే ముందు.. ఈ స్కిట్‌ మేం అవసరాల్లో ఉన్న దర్శకులకు విరాళాలు సేకరించేందుకు వేశామన్న సంగతి తెలుసుకోండి. మా సినిమాల రివ్యూలను స్వేచ్ఛగా రాయండి.. అంతేకానీ ఓ మంచి ఉద్దేశంతో ఐకమత్యంతో మేం చేసే కార్యక్రమాలకు రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని హరీష్‌ ట్వీట్‌ చేశారు.

More Telugu News