Suryapet: ఎర్రచొక్కా వేసుకుని ఓటేసేందుకు వచ్చాడని అభ్యంతరం.. వాగ్వివాదం!

  • అడ్డుకున్న అధికార పార్టీ నేతలు
  • చొక్కా విప్పి రావాలన్న పోలీసులు
  • ఓటర్లు కల్పించుకోవడంతో సద్దుమణిగిన వివాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం, బర్కత్‌గూడెంలోని పోలింగ్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఎర్రచొక్కా ధరించి ఓటు వేసేందుకు రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. తన భార్యతో కలిసి ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్‌లో నిలబడిన ఓ వ్యక్తిని అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కూడా అతడిని చొక్కా విప్పి పోలింగ్ బూత్‌లోకి వెళ్లాలని, లేదంటే చొక్కా మార్చుకుని రావాలని సూచించారు.

 దీంతో అతని భార్య పోలీసులతో వాదనకు దిగింది. ఎర్రచీర కట్టుకుని వస్తే తనతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? అని ఆమె ప్రశ్నించడంతో అక్కడ మరింత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితిని గమనించిన మిగతా ఓటర్లు కల్పించుకుని వారితో ఓటు వేయించి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.

More Telugu News