Telangana: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్.. విద్యా శాఖ నిర్ణయం

  • ఫలితాల వెల్లడికి ముందు, తర్వాత కౌన్సెలింగ్  
  • ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి
  • ఫెయిల్ అయిన విద్యార్థులు కుంగిపోకుండా చూడాలి

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఫలితాల వెల్లడికి ముందు, వెలువడ్డ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానోపాధ్యాయులంతా ఆయా పాఠశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 లేదా 10న విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తీర్ణులైన వారికి ఉన్నత విద్యా అవకాశాలపై దిశా నిర్దేశం చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు కుంగిపోకుండా భరోసా కల్పించాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు.

More Telugu News