Kerala: కేరళలో కేసీఆర్.. పినరయి విజయన్ తో భేటీ కానున్న సీఎం

  • కేరళ చేరుకున్న కేసీఆర్
  • కమ్యూనిస్టులను ఆహ్వానించాలని నిర్ణయం
  • విజయన్‌తో రాజకీయ పరిస్థితులపై చర్చ

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యారు. తాజాగా మళ్లీ ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలో కేసీఆర్ నేడు కేరళ వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ కానున్నారు. కమ్యూనిస్టులను ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు తన అడుగులు ఆ దిశగా వేస్తున్నారు. ప్రస్తుతం విజయన్‌తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం తమిళనాడు వెళ్లి శ్రీరంగం, రామేశ్వరం ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడి వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఆ తరువాత కర్ణాటక వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫ్రంట్ గురించి చర్చించనున్నట్టు సమాచారం.

More Telugu News