Smriti Irani: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో కుమార్తె ఉత్తీర్ణతపై పొంగిపోతున్న స్మృతీ ఇరానీ

  • నేడు సీబీఎస్ఈ ఫలితాల వెల్లడి
  • 82 శాతం మార్కులతో పాసైన స్మృతి తనయ జోయిష్ 
  • ట్వీట్ చేసిన స్మృతి

ఇవాళ ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపాయి. స్మృతి కుమార్తె జోయిష్ ఇరానీ కూడా ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసింది. ఈ పరీక్షల్లో జోయిష్ 82 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలు కావడం పట్ల స్మృతి పొంగిపోతున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య కూడా తన కుమార్తె ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవడం గర్వంగా ఉందని స్మృతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "భవిష్యత్తుకు ఇదే నాంది జో" అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే స్మృతి తనయుడు జోహర్ ప్లస్ టూ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టుల్లో 91 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

More Telugu News