Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు!

  • నేటితో ముగిసిన రిమాండ్
  • కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
  • నిందితులు పులివెందుల సబ్ జైలుకు తరలింపు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ల రిమాండ్ ఈరోజు ముగియడంతో పోలీసులు పులివెందుల కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు ఈ ముగ్గురికి ఈ నెల 20 వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు తమను కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల సబ్ జైలుకు తరలించాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ తల్లిదండ్రులు, బంధువులను కలుసుకునేందుకు కడపలో ఇబ్బందిగా ఉందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వీరిని పులివెందుల సబ్ జైలుకు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

More Telugu News