10th class: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల విడుదల.. మొదటి ర్యాంకును పంచుకున్న 13 మంది విద్యార్థులు

  • 500 మార్కులకు గాను 499 మార్కులు తెచ్చుకున్న టాపర్లు
  • 10వ తరగతిలో 91.1 శాతం ఉత్తీర్ణత
  • 99.85 శాతంతో తొలి స్థానంలో నిలిచిన త్రివేండ్రం రీజియన్  

10వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. 500 మార్కులకు గాను 499 మార్కులను తెచ్చుకున్న 13 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నారు. 498 మార్కులను సాధించిన 24 మంది రెండో ర్యాంకును పంచుకున్నారు. 497 మార్కులతో 58 మంది విద్యార్థులు మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు.

మొత్తం మీద 10వ తరగతిలో 91.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 99.85 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం, 99 శాతంతో చెన్నై, 95.89 శాతంతో అజ్మీర్ రీజియన్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ప్రతి ఏటా ఫలితాలను విడుదల చేస్తున్న సమయం కంటే ముందుగానే ఈసారి ఫలితాలను వెల్లడించామని బోర్డు ఈ సందర్భంగా ప్రకటించింది. దీనివల్ల ఉన్నత చదువుల అడ్మిషన్ల విషయంలో విద్యార్థులకు తగినంత సమయం లభిస్తుందని తెలిపింది.

More Telugu News