Telangana: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ఫిట్స్ తో రోడ్డుపై పడిపోయిన బైక్ రైడర్!

  • పంజాగుట్ట సెంటర్ వద్ద ఘటన
  • బాధితుడు ఆసుపత్రికి తరలింపు
  • అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

  హైదరాబాద్ లోని ట్రాఫిక్ పోలీసులు ఈరోజు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఒక్కసారిగా ఆపేస్తూ వాహనదారులను ఇబ్బంది పెట్టారు. నగరంలోని పంజాగుట్ట సెంటర్ వద్ద తనిఖీల్లో భాగంగా బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఓ కానిస్టేబుల్ అనూహ్యంగా అడ్డుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా ఆందోళనకు లోనైన సదరు ప్రయాణికుడు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.  ఈ ఘటనలో గాయపడ్డ ప్రయాణికుడిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ట్రాఫిక్ పోలీసుల తీరుపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News