Telangana: గ్లోబరీనా సంస్థపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదు?: తెలంగాణ ప్రభుత్వానికి కోదండరాం సూటి ప్రశ్న

  • హైదరాబాద్ లో ఈరోజు అఖిలపక్ష సమావేశం
  • ఇంటర్ విద్యార్థుల మరణాలు  ప్రభుత్వ హత్యలేనన్న చాడ
  • ఈ నెల 11 విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసన

తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై అఖిలపక్ష నాయకులు ఈరోజు హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న 26 ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

వేలాది మంది విద్యార్థులు నష్టపోవడానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని టీజేఎస్ అధినేత కోదండరాం ప్రశ్నించారు. ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన దీక్ష చేస్తామని ప్రకటించారు.

More Telugu News