India: జావేద్ అక్తర్.. క్షమాపణ చెప్పకుంటే నాలుక కోస్తాం.. కాళ్లు పీకేస్తాం!: కర్ణిసేన హెచ్చరిక

  • బుర్ఖాలపై నిషేధం విధించిన శ్రీలంక
  • ఇక్కడా అదే చేయాలన్న శివసేన
  • తలపై కొంగు వేసుకోవడాన్నికూడా నిషేధించాలన్న జావేద్ అక్తర్

ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ పై మహారాష్ట్ర కర్ణిసేన చీఫ్ జీవన్ సింగ్ మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే కళ్లు పీకేస్తామనీ, నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇంటిలోకి దూసుకొచ్చి చితకబాదుతామని బెదిరించారు. శ్రీలంక ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తరహాలో భారత్ లోనూ ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలను నిషేధించాలని శివసేన కోరింది. దీంతో ఒక్క బుర్ఖాలే ఎందుకు?.. మహిళలు తలపై కొంగును కప్పుకునే విధానాన్ని కూడా నిషేధించాలని జావేద్ అక్తర్ సూచించారు.

దీనిపై జీవన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మూడు రోజుల్లోగా క్షమాపణలు తెలపాలని జావేద్‌కు చెప్పాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాం’ అని చెప్పారు. కాగా, పద్మావతి సినిమా సమయంలోనూ కర్ణిసేన ఓ రేంజ్ లో గందరగోళం సృష్టించింది. పలు థియేటర్లపై దాడిచేయడంతో పాటు దేశవ్యాప్తంగా కర్ణిసేన సభ్యులు అందోళనకు దిగారు.

More Telugu News