Vizag: డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందేమో!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • విశాఖ సంస్కృతిని దెబ్బ తీసేలా రేవ్ పార్టీలు 
  • ఈ కేసులో అసలు నిందితులను తప్పించారు
  • ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ రేవ్ పార్టీ జరిగింది

విశాఖ సంస్కృతిని దెబ్బతీసేలా రేవ్ పార్టీలు జరగడం దారుణమని, రేవ్ పార్టీ కేసులో అసలు నిందితులను తప్పించారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవ్ పార్టీ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ రేవ్ పార్టీ జరిగిందని, ఈ పార్టీ అనుమతి కోసం ఆ మంత్రి పేషీ నుంచి ఎక్సైజ్ అధికారులకు ఎనిమిది సార్లు ఫోన్ కాల్స్ వెళ్లాయని అన్నారు.

ఈ పార్టీలో పది మంది యువతులు పాల్గొన్నారని, మద్యం తాగేందుకని ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజ్ ఫ్రంట్ నిర్వాహకులను అరెస్టు చేయాలని డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందేమోనని విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News