e bike: టపాకాయలా పేలిన ఈ-బైక్.. ఐదుగురు దుర్మరణం, 38 మందికి గాయాలు!

  • చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ లో ఘటన
  • బైక్ కు చార్జింగ్ పెట్టి బయటకు వెళ్లిన ఓనర్
  • షార్ట్ సర్క్యూట్ తో పేలిపోయిన బైక్

ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది. చైనాలో స్వయంప్రతిపత్తి ఉన్న గ్యాంగ్జిజువాంగ్ ప్రాంతంలో ఈరోజు అగ్నిప్రమాదం చెలరేగింది. గులియన్ లోని ఓ నివాస సముదాయంలో ఇంటి యజమాని తన విద్యుత్ తో నడిచే బైక్ కు చార్జింగ్ పెట్టాడు. అనంతరం బయటకు వెళ్లాడు.

అయితే వాహనంలో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అనంతరం అది మంటలను ఎగజిమ్ముతూ పేలిపోయింది. ఈ మంటలు మిగతా ఇళ్లకూ వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 38 మందికి కాలిన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అధికారులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన చైనా పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Don’t leave your charging e-bike unattended! Or it could end up like this: A fire reportedly caused by an e-bike killed 5 people and injured 38 others on Sunday at a residential building in Guilin, S China’s Guangxi Zhuang Autonomous Region. <a href="https://t.co/VScpZS5v2G">pic.twitter.com/VScpZS5v2G</a></p>— People's Daily, China (@PDChina) <a href="https://twitter.com/PDChina/status/1124924184654692352?ref_src=twsrc%5Etfw">May 5, 2019</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News