vaishnav tej: మెగా హీరో మూవీ టైటిల్ ఇదేనంటూ ఫిల్మ్ నగర్ టాక్

  • బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ 
  • ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ .. జాలరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. జాలరి లుక్ తోనే వైష్ణవ్ పోస్టర్ కూడా బయటికి వచ్చింది.

గళ్ల లుంగీ .. రంగు బనీను .. నోట్లో బీడీ .. భుజంపై 'వల'తో వైష్ణవ్ ఈ పోస్టర్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్ ను ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటన చేయవలసి వుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్, యువ హీరోలకి ఏ స్థాయి పోటీ ఇస్తాడో చూడాలి.

More Telugu News