Andhra Pradesh: పామును మింగేందుకు ప్రయత్నించిన కప్ప.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

  • ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఘటన
  • కప్ప దగ్గరకు వచ్చిన పాము
  • వెంటనే నోట కరచుకున్న ఉభయచరం
  • వీడియో తీసిన స్థానికులు

సాధారణంగా కప్పలను పాములు మింగుతుంటాయి. కానీ రోటీన్ కు భిన్నంగా ఓ కప్ప ప్రవర్తించింది. తన దగ్గరకు వచ్చిన పామును గుటుక్కున నోట కరచుకుంది. అనంతరం దాన్ని మింగేందుకు ప్రయత్నించింది. అయితే పాము కనీసం 2 అడుగుల పొడవు ఉండటంతో మింగలేక, కక్కలేక ఇబ్బంది పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం రామన్నపేటలో చోటుచేసుకుంది. దీన్ని వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News