Rajeev: ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌ విషయంలో ముగ్గుర్ని సస్పెండ్ చేశాం: తెలంగాణ విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్

  • పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకే అర్హత
  • అర్హత లేని వారు పాల్గొన్నట్టు విచారణలో వెల్లడి
  • హెడ్మాస్టర్ ని కూడా సస్పెండ్ చేశాం

కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా పదోతరగతి బోధించే ఉపాధ్యాయులకే స్పాట్ వాల్యుయేషన్ చేసే అర్హత ఉంటుందన్నారు.

అయితే ఇద్దరు అర్హత లేని ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, అనిత స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్నట్టు విచారణలో తేలిందని, ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని రాజీవ్ తెలిపారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లను రీ వాల్యుయేషన్ చేయించాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. దీనికి కారణమైన ఆ ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన ఓ హెడ్మాస్టర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News