సైరా సెట్ కాలిపోవడంపై రామ్ చరణ్ స్పందన

Fri, May 03, 2019, 04:07 PM
  • ఇది దురదృష్టకరం
  • అదృష్టం బాగుండి ఎవరికీ ప్రమాదం జరగలేదు
  • వీలైనంత త్వరగా చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం
ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన సైరా సినిమా సెట్ కాలిపోవడంపై ఆ చిత్ర నిర్మాత, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించారు. కోకాపేటలో సైరా చిత్రం కోసం తాము నిర్మించిన సెట్ అగ్నికి ఆహుతి అవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం సైరా సెట్ తగలబడిపోయిందన్న సమాచారంతో దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో యూనిట్ సభ్యులెవరికీ ప్రమాదం జరగడం కానీ, గాయాలు తగలడం కానీ జరగలేదని రామ్ చరణ్ పేర్కొన్నారు. అందరూ సురక్షితంగానే ఉన్నారని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. సైరా చివరి షెడ్యూల్ ను వీలైనంత త్వరగా ముగించడంపై దృష్టి పెడుతున్నామని ఈ మెగా హీరో వివరించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement