modi: ఫణి ఎఫెక్ట్.. మోదీ సభ వాయిదా

  • విలయతాండవం చేస్తున్న ఫణి తుపాను
  • జార్ఖండ్ పై కూడా అత్యధికంగా తుపాను ప్రభావం
  • మే 6కు వాయిదా పడ్డ మోదీ సభ

ఫణి తుపాను తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మోదీ సభ వాయిదా పడింది. జార్ఖండ్ లోని ఛాయిబాసాలో మే 5న బీజేపీ నిర్వహిస్తున్న సభలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఫణి తుపాను ఒడిశాలో తీరం దాటి, విలయతాండవం చేస్తోంది. జార్ఖండ్ కూడా ఒడిశాకు ఆనుకునే ఉండటం వల్ల తుపాను ప్రభావం ఆ రాష్ట్రంపై కూడా అధికంగానే ఉండబోతోంది. దీంతో, మోదీ ర్యాలీని మే 6కు వాయిదా వేసినట్టు బీజేపీ నేత రాజేశ్ కుమార్ శుక్లా తెలిపారు.

మరోవైపు తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 19.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరప్రాంతంలో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు మృతి చెందినట్టు సమాచారం.

More Telugu News