Andhra Pradesh: మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాదు.. యూపీఏకూ కష్టమే: సీనియర్ నటుడు శివకృష్ణ

  • 2014లో బీజేపీకి వచ్చిన మెజార్టీ ఇప్పుడు రాదు
  • బీజేపీకి రెండు వందల సీట్లు రావడం కూడా కష్టమే
  • ప్రాంతీయ పార్టీల కూటమికి 300 సీట్లు రావొచ్చు

కేంద్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం కష్టమని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి రెండు వందల సీట్లు రావడం కూడా కష్టమేనని అన్నారు. గతంలో ఉపఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ నష్టపోయిందని, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై ఉందని న్నారు. జీఎస్టీ ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం సరిదిద్దుకుందని, పదిహేను సార్లు మార్పులు చేశారని, దాని వల్ల ప్రజలకు మంచే జరిగిందని అన్నారు.

 అయితే, 2014లో బీజేపీకి వచ్చిన మెజార్టీ ఇప్పుడు రాదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆస్కారమే లేదని జోస్యం చెప్పారు. అదే విధంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితీ లేదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడ్డ కూటమికి మూడు వందల సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ కూటమి ఎవరికి సపోర్టు చేస్తే వాళ్లు అధికారంలోకి వస్తారని అభిప్రాయపడ్డారు.

More Telugu News