Andhra Pradesh: ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేసిన ఈసీ!

  • ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఫణి
  • విశాఖ, విజయనగరం, తూ.గోదావరి, శ్రీకాకుళంలో కోడ్ ఎత్తివేత
  • సహాయక చర్యలను ముమ్మరం చేయనున్న ప్రభుత్వం

ఉత్తరాంధ్రపై పెను తుపాను ‘ఫణి’ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నాలుగు జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా, వాటిని అధికార యంత్రాంగం పర్యవేక్షించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయం నేపథ్యంలో అధికారులు ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయనున్నారు. అలాగే ప్రభుత్వం ఇక్కడి పరిస్థితిని సమీక్షించడం వీలవుతుంది. ఒడిశాలోని పూరీ వద్ద ఫణి తుపాను తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో మరో 3-4 గంటలు భారీ వర్షాలు, భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

More Telugu News