Telangana: విద్యా శాఖా మంత్రి మా జిల్లా వాడు కావడం మా దౌర్భాగ్యం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • తెలంగాణ ఉద్యమంలో మాదిరి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి
  • పరీక్షలు కూడా నిర్వహించలేని కేసీఆర్ ప్రధాని అవుతారట?
  • కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్ప వేరే శాఖలపై సమీక్షలు నిర్వహించరే?

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఇంకా ఆగలేదు. తాజాగా, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి తమ జిల్లా వాడు కావడం తమ దౌర్భాగ్యమని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించలేని కేసీఆర్ ప్రధాని అవుతారట, కమీషన్ వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పా, ఇంకో శాఖపై ఆయన సమీక్ష నిర్వహించరని విమర్శించారు.

More Telugu News