Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు!

  • ఎన్నికల్లో రూ.50 కోట్ల ఖర్చు వ్యాఖ్యలు
  • ఈసీకి వైసీపీ, సీపీఐ ఫిర్యాదు
  • విచారణకు ఆదేశించిన ఈసీ

తెలుగుదేశం సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. ఇటీవల ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల్లో గెలవాలంటే దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని జేసీ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలు, మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జేసీ వ్యాఖ్యలపై వైసీపీ, సీపీఐలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని ఈసీ జిల్లా కలెక్టర్ ను అప్పట్లో ఆదేశించింది. తాజాగా ఈ వ్యవహారంపై జేసీ దివాకర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది.

గతంలో ఓ మీడియా సమావేశంలో జేసీ మాట్లాడుతూ..‘అనంతపురం లోక్ సభ స్థానంలో నేను, ఇతర ప్రత్యర్థులంతా కలిసి పెట్టిన ఖర్చు రూ.50 కోట్ల వరకూ ఉంటుంది. ఇందులో ఒక పార్టీ ఎక్కువా కాదు.. మరో పార్టీ తక్కువా కాదు. అన్ని పార్టీలు కలిసి రూ.50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాయి’ అని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వ్యాఖ్యలపైనే కేసు నమోదయింది.

More Telugu News