pani: ‘ఫణి’ తుపాన్‌ బీభత్సంతో వణుకుతున్న పూరీ వాసులు

  • 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • కళ్ల ముందే కూలుతున్న చెట్లు
  • ఎగిరి పడుతున్న హోర్డింగ్‌లు, పైకప్పులు

పలుమార్లు దిశ మార్చుకుంటూ అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఒడిశా రాష్ట్రం పూరీ సమీపాన తీరం దాటిన ‘ఫణి’ తుపాన్ బీభత్సానికి నగరం చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా ప్రళయం కళ్లముందు విలయ తాండవం చేస్తుండడంతో నగరవాసులు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కళ్లముందే కూలుతున్న చెట్లు, ఎగిరి పడుతున్న ఇళ్ల పైకప్పులు, హోర్డింగ్‌లు చూసి భీతావహులవుతున్నారు. గాలుల బీభత్సానికి నగరం అంతా అల్లకల్లోలంగా మారింది. ఎటు చూసినా తుపాన్‌ రేపిన విధ్వంసమే కళ్లకు దర్శనమిస్తోంది. ఈ బీభత్సం ఎన్ని గంటలపాటు కొనసాగుతుందో అర్థంకాక నగరవాసులు ప్రాణాలు అరచేత పెట్టుకుని గడుపుతున్నారు.

More Telugu News