K Lakshman: ఐదు రోజుల నిరాహారదీక్షను విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్!

  • దీక్ష ప్రారంభంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిమ్స్ కు తరలిస్తే, అక్కడే దీక్ష చేసిన లక్ష్మణ్
  • నిమ్మరసం ఇచ్చిన కేంద్ర మంత్రి హన్సరాజ్

తెలంగాణ ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, గడచిన ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌, తన నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ ఈ ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వచ్చి లక్ష్మణ్‌ ను పరామర్శించి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

 ఐదు రోజుల క్రితం లక్ష్మణ్ దీక్షను ప్రారంభించగా, అదే రోజు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ నిమ్స్ లోనే తన దీక్షను కొనసాగించారు. వైద్య చికిత్సనూ నిరాకరించారు. కాగా, హన్సరాజ్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపీ దత్తాత్రేయ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.

More Telugu News