Inter: ఇంటర్ లానే... తెలంగాణ టెన్త్ మూల్యాంకనంలోనూ లోపాలు!

  • ఇప్పటికే ఇంటర్ వ్యవహారంలో విద్యార్థులను శాంతపరిచే ప్రయత్నాల్లో ప్రభుత్వం
  • అనర్హులతో టెన్త్ జవాబు పత్రాలు దిద్దించినట్టు నిర్ధారణ 
  • ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపు

ఓ వైపు ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలను సరిదిద్ది ఆగ్రహంగా ఉన్న ప్రజలను, విద్యార్థులను శాంతపరిచే ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు మరో ఇబ్బంది ఎదురైంది. పదో తరగతి మూల్యాంకనంలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. అనర్హులు పేపర్లు దిద్దినట్టు తేలింది.

పేపర్లు దిద్దేందుకు సరైన అర్హతలు లేని ఇద్దరు టీచర్లకు ఓ ప్రధానోపాధ్యాయుడు తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వగా, ఆ విషయం అధికారుల విచారణలో బయటపడ్డ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వీరిద్దరూ హిందీ జవాబుపత్రాలను దిద్దారని తేలడంతో ఇద్దరినీ విధుల నుంచి తొలగించి, ధ్రువపత్రం ఇచ్చిన హెడ్ మాస్టర్ పై చర్యలకు సిఫార్సు చేశారు.

ఇక వీరిద్దరూ 523 జవాబు పత్రాలను దిద్దినట్టు గుర్తించిన అధికారులు పునః మూల్యాంకనానికి ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ఉపాధ్యాయులతో ఈ పేపర్లు దిద్దించి, పాత మార్కులు, కొత్త మార్కుల వివరాలను సీల్డ్ కవర్ లో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు పంపారు.  

More Telugu News