పంజాబ్ లో సన్నీలియోన్ ను పోటీకి దించినా గెలుపు మాదే!: కాంగ్రెస్ నేత రాజ్ కుమార్

- బీజేపీకి ఇక్కడ అభ్యర్థులు దొరకలేదు
- అందుకే సన్నీడియోల్ ను పోటీకి దింపారు
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన
బీజేపీ సన్నీడియోల్ ను కాకుండా సన్నీలియోన్ ను బరిలోకి దించినా కాంగ్రెస్ దే విజయమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయిందన్నారు. కాగా, రాజ్ కుమార్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. మాజీ శృంగార తారను ఈ వివాదంలోకి లాగడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం రాజ్ కుమార్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సమర్థిస్తున్నారు.