Monkey: కోతికి దొంగతనం చేయడం నేర్పించిన ఘనుడు... టోల్ గేట్ నుంచి డబ్బు స్వాహా!

  • కాన్పూర్ సమీపంలో ఘటన
  • బారా టోల్ ప్లాజాలోకి దూసుకొచ్చిన మర్కటం
  • రూ. 5 వేలు తీసుకుని జంప్

కోతికి దొంగతనం చేయడం నేర్పించిన ఓ ఘనుడు, టోల్ గేట్ బూత్ నుంచి దాని సాయంతో రూ. 5 వేలు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కాన్పూర్ సమీపంలోని డెహత్ దగ్గర ఉన్న బారా టోల్ ప్లాజాలో జరిగింది. టోల్ గేట్ వద్దకు ఓ కారు వచ్చి ఆగగానే, కారు కిటికీలో నుంచి ఓ మర్కటం గబుక్కున బయటకు దూకి క్యాబిన్ కిటికీ గుండా లోపలికి వచ్చింది. డబ్బు ఉంచే సొరుగు నుంచి చేతికందినంత తీసుకుని అంతే వేగంగా వెనక్కు వెళ్లిపోయింది. ఈ హాఠాత్పరిణామం నుంచి తేరుకునే సరికే కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కోతిని చూడగానే భయానికి గురైన టోల్ ప్లాజా ఉద్యోగి, దాన్ని తరిమేయాలని చూసినా ఫలితం లేకపోయింది.

More Telugu News