Foni: వేగాన్ని పెంచుకున్న 'ఫణి'... పూరీ వద్ద తీరాన్ని తాకిన పెను తుపాను!

  • సముద్రంలో గంటకు 7 నుంచి 15 కి.మీ. వేగం
  • తీరాన్ని దాటేవేళ 22 కిలోమీటర్ల వేగం
  • 11 గంటల సమయానికి పూర్తిగా దాటుతుంది
  • వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు

సముద్రంలో ఉన్నంత సేపూ గంటకు 7 నుంచి 15 కిలోమీటర్ల వేగాన్ని దాటని 'ఫణి' తుపాను, తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగాన్ని పెంచుకుంది. కొద్దిసేపటి క్రితం తుపాను పూరీ సమీపంలో తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన వేళ ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని అధికారులు వెల్లడించారు.

ఈ ఉదయం 11 గంటల సమయానికి తుపాను పూర్తిగా తీరాన్ని దాటుతుందని, ఆపై క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. తీరం దాటుతున్న వేళ దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు తెలుస్తోంది. తుపాను నష్టంపై ఇప్పటికిప్పుడు అంచనాలు వేయలేమని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం తరువాత పూర్తిగా తీరాన్ని దాటి, బలహీనపడిన తరువాతనే ఏమైనా చేసే వీలుంటుందని వెల్లడించారు. కాగా, ఫణి ప్రభావం ఉత్తరాంధ్రపై ఇంకా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

More Telugu News