Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సైరా'లో కీలక పాత్రలో అనుష్క 
  • రానా సినిమాలో బాలీవుడ్ నటుడు 
  • మరో సంస్థ చేతిలోకి 'భారతీయుడు 2'

*  చిరంజీవి కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రంలో అందాలతార అనుష్క కూడా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నయనతార, తమన్నా ఇందులో నటిస్తుండగా.. మరో కీలక పాత్రకు అనుష్కను తీసుకున్నట్టు తెలుస్తోంది.
*  రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' పేరిట ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను తీసుకున్నారట. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.
*  కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో 'భారతీయుడు 2' చిత్రాన్ని ప్రారంభించడం, కొంత షూటింగ్ అయ్యాక అది మళ్లీ మొదలుకాకపోవడం తెలిసిందే. బడ్జెట్ ఎక్కువ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణాన్ని ఆపేసినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ ప్రాజక్టును టేకోవర్ చేయడానికి సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.

More Telugu News