బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ

02-05-2019 Thu 17:25
  • నేటి ఉదయం బస్సులో కాల్పులు
  • వెనుక డోర్ నుంచి పరారైన నిందితుడు
  • ఎలాంటి స్పష్టతా రాలేదన్న ఏసీపీ

నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45 గంటల సమయంలో బస్సు  పంజాగుట్ట వద్దకు రాగానే కాల్పులు జరిపి వెనుక డోర్ నుంచి దిగి వెళ్లి పోయాడు. అయితే ఆ కాల్పులు జరిపిన వ్యక్తి విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బస్ కండక్టర్ భూపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తిరుపతన్న పేర్కొన్నారు.