foni: ‘ఫణి’పై ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

  • తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష
  • అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలి
  • ప్రధాని మోదీ ఆదేశాలు

‘ఫణి’ తుపాన్ పై ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, ఐఎండీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. తాగునీరు, విద్యుత్, టెలికాం పునరుద్ధరణ పనుల్లో ఎన్డీఆర్ఎఫ్, సైనికుల సాయంపై చర్చించారు. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరు రాష్ట్రాల్లో అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఏపీలోని కళింగపట్నం, భీమునిపట్నంలో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక; విశాఖ, గంగవరం, కాకినాడ, వాడరేవులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

More Telugu News