Andhra Pradesh: ప్రధాని కుర్చీ ఎక్కాలన్న ఆశ నాకు లేదు.. మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు!

  • మే 23 తర్వాత మోదీనే గల్లంతవుతారు
  • అందరం చర్చించి ప్రధానిని ఎన్నుకుంటాం
  • ఈసీ మోదీ కనుసన్నల్లో పనిచేస్తోంది

కాంగ్రెస్, టీడీపీ, డీఎంకే సహా పలు పార్టీలు కలిసి ఏర్పడ్డ మహాకూటమి మే 23 తర్వాత గల్లంతు అవుతుందని మోదీ చెప్పడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మహాకూటమి తర్వాత ముందు తాను గల్లంతు కాకుండా చూసుకోవాలని మోదీకి చురకలు అంటించారు. తనకు ప్రధాని కుర్చీపై ఎంతమాత్రం ఆశ లేదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంచుకుంటామని తేల్చిచెప్పారు. బీజేపీయేతర  రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయనీ, ఈసీకి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోడ్ ఉల్లంఘనలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసీ పూర్తిగా మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. నెహ్రూ, వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ప్రధాని పదవికి వన్నె తీసుకొస్తే, మోదీ దాని స్థాయిని దిగజార్చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News