America: మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం మా దౌత్య విజయం: అమెరికా

  • విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ట్వీట్‌
  • దక్షిణాసియాలో శాంతికి ఇది చాలా కీలక చర్య
  • అంతర్జాతీయ ఆకాంక్షను చైనా కూడా అర్థం చేసుకుంది

దక్షిణాసియాలో శాంతికి అత్యంత కీలకమైన అడుగు పడిందని, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం అమెరికా సాధించిన గొప్ప దౌత్య విజయమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ఐక్యరాజ్య సమితి మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ నిర్ణయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా దౌత్య ప్రతినిధులు సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. చైనా కూడా పదేళ్ల తర్వాత అంతర్జాతీయ ఆకాంక్షలను అర్థం చేసుకుని అడ్డంకులు సృష్టించకుండా మంచి పని చేసిందన్నారు. ఒకవేళ చైనా 1267వ కమిటీ తీర్మానాన్ని అడ్డుకుని ఉంటే డ్రాప్ట్‌ రూపంలో మసూద్‌పై నిషేధం విధించేలా అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News