Andhra Pradesh: కెనడాలో సత్తా చాటిన గుంటూరు వాసి.. అల్బెర్టా రాష్ట్ర మంత్రిగా ప్రసాద్ పాండా బాధ్యతలు!

  • అల్బెర్టా రాష్ట్రంలో బాధ్యతల స్వీకరణ
  • రెండోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం
  • 15 ఏళ్ల క్రితం కెనడాకు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వ్యక్తి ప్రసాద్ పాండాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెనడాలోని అల్బర్టా రాష్ట్రానికి మౌలిక వసతుల శాఖా మంత్రిగా నియమితులయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా సంగమ్ జాగర్లమూడి గ్రామానికి చెందిన ప్రసాద్ పాండా 15 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రసాద్ పాండా అల్బెర్టాలోని స్కూళ్లు, ఆసుపత్రులు, నివాసాల నిర్మాణాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా సమీక్షిస్తారు. ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న ప్రసాద్ పాండా గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ కోర్ వంటి బహుళజాతి కంపెనీల్లో ఉన్నత పదవులను నిర్వహించారు.

More Telugu News