Avika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మెగా హీరో సినిమాలో అవికా గోర్ 
  • 'దొరసాని' షూటింగ్ పూర్తి 
  • రానా సినిమాలో ప్రియమణి

*  సాయిధరం తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు 'ఉయ్యాల జంపాల' ఫేం అవికా గోర్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడుగా, డాక్టర్ రాజశేఖర్ చిన్నమ్మాయి శివాత్మిక కథానాయికగా పరిచయం అవుతున్న చిత్రం 'దొరసాని'. నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు.  
*  రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' పేరిట ఓ పిరీడ్ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. సాయిపల్లవి కథానాయికగా నటించే ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుందట.

More Telugu News