sekhar kammula: పాటలు మినహా చాలావరకూ కానిచ్చేసిన శేఖర్ కమ్ముల

  • శేఖర్ కమ్ముల నుంచి తాజా చిత్రం
  • కొత్త హీరో హీరోయిన్ల పరిచయం 
  • దసరాకి ముందు విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ భారీ విజయం తరువాత ఆయన నుంచి వచ్చే సినిమా కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల మాత్రం తన తాజా చిత్రానికి సంబంధించిన సమాచారం బయటికి రాకుండా చకచకా షూటింగు కానిచ్చేస్తున్నాడు.

టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ సినిమా ద్వారా ఆయన కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నాడు. వాళ్లు ఎవరు? ఎలా వుంటారు? అనే విషయాలు బయటికిరాకుండా శేఖర్ కమ్ముల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేశాడు. మూడు పాటలు మాత్రమే పెండింగ్ లో వున్నట్టుగా చెబుతున్నారు. ఏషియన్ సునీల్ నిర్మిస్తోన్న ఈ సినిమా, దసరాకి ముందు విడుదలకావొచ్చునని అంటున్నారు.

More Telugu News