Mahesh Babu: ముందుగా విక్రమ్ కుమార్ ఆ కథను మహేశ్ కి చెప్పాడట

  • విక్రమ్ కుమార్ నుంచి 'గ్యాంగ్ లీడర్'
  • వైవిధ్యభరితమైన పాత్రలో నాని
  •  కొంతవరకూ చిత్రీకరణ పూర్తి

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. 'జెర్సీ' సినిమాకి సంబంధించిన హడావిడి పూర్తికావడంతో, విక్రమ్ కుమార్ సినిమాపై నాని పూర్తి దృష్టి పెట్టనున్నాడు.

 నానితో విక్రమ్ కుమార్ చేస్తున్న ఈ సినిమా, ముందుగా మహేశ్ బాబుతో చేయాలనుకున్నదే అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ముందుగా విక్రమ్ కుమార్ .. మహేశ్ తో ఒక సినిమా చేయాలనుకుని, ఒక కథను వినిపించాడు. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సెట్ కాదనీ, ఆ తరహా పాత్రలో తనని చూడటానికి ఆడియన్స్ ఇష్టపడరని మహేశ్ బాబు అన్నాడట. ఆ కథనే ఇప్పుడు విక్రమ్ కుమార్ .. నానీతో చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయంపై విక్రమ్ కుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Telugu News