Narendra Modi: రాహుల్‌ గాంధీపై ప్రధాని వ్యాఖ్యల్లో తప్పేం లేదు: క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ఎన్నికల సంఘం

  • ఆ వ్యాఖ్యలేవీ కోడ్‌ ఉల్లంఘన కిందకు రావు
  • హిందువులను కాంగ్రెస్‌ అవమానించిందన్న మోదీ
  • వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయడాన్ని తప్పుపట్టిన నమో

ప్రధాని మోదీ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు రావని కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. హిందువులను కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా అవమానించిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు శిక్షించారని ఓ ఎన్నికల సభలో మోదీ వ్యాఖ్యానించారు. అలాగే, కేరళ రాష్ట్రం వయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ పోటీకి దిగడంపైనా మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు కాంగ్రెస్‌కు శిక్ష విధించినందున వారి జనాభా అధికంగా ఉన్న చోట్ల పోటీకి రాహుల్‌ భయపడుతున్నారని, అందుకే మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసపోతున్నారని విమర్శలు కురిపించారు.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. మతపరమైన వ్యాఖ్యలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు మోదీ ప్రసంగాలు పరిశీలించిన ఎన్నికల సంఘం ఆ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు రావని స్పష్టంచేసింది.

More Telugu News