sharwanand: ద్విభాషా చిత్రానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

  • సుధీర్ వర్మతో శర్వానంద్ 
  • తదుపరి సినిమాగా '96' మూవీ రీమేక్ 
  • ఏడాది చివర్లో సెట్స్ పైకి

శర్వానంద్ అభిమానులంతా ఆయన తాజా చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, శర్వానంద్ '96' మూవీ రీమేక్ లో చేస్తున్నాడు. సమంత జోడీగా ఆయన చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం 'కెన్యా'లో షూటింగు జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా శర్వానంద్ లైన్లో పెట్టేసినట్టుగా సమాచారం. ఇది తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే చిత్రమని చెబుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మితమయ్యే ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News