Yeti footprints: యతి ఉందంటే నేను నమ్మను.. అవి ఎలుగుబంటి పాదముద్రలే: శాస్త్రవేత్త

  • యతి అడుగులంటూ ఇండియన్ ఆర్మీ పోస్టు
  • మరోసారి తెరపైకి మంచుమనిషి
  • ఆ అడుగులు బ్రౌన్ బేర్‌వి అయి ఉంటాయంటున్న నిపుణులు

యతి పాదముద్రలు చూశామంటూ ఇండియన్ ఆర్మీ చేసిన పోస్టు మంచుమనిషి ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారిన ఈ విషయంపై అప్పుడే బోల్డన్ని కథనాలు కూడా వచ్చేశాయి. పురాణాల్లోనూ యతి ప్రస్తావన ఉందని, ఒక్కో దేశంలో యతిని ఒక్కో పేరుతో పిలుస్తారంటూ పురాణ, జానపదాల్లో వాటి ప్రస్తావన గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి.

హిమాలయ పర్వత సానువుల్లో యతి ఉనికి గురించి వస్తున్న వార్తలపై డెహ్రాడూన్‌‌లోని వైల్డ్‌లైప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బివాష్ పాండవ్ స్పందించారు. హిమాలయాల్లో యతి వంటి జీవి ఉందన్న వార్తలను తాను నమ్మబోనన్నారు. ఆర్మీకి కనిపించిన పాముద్రలు బహుశా బ్రౌన్ బేర్‌వి అయి ఉండొచ్చన్నారు. అయితే, నేపాల్‌లోని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)కు చెందిన సంతోష్ మణి మాట్లాడుతూ.. ఇక్కడి స్థానికులు  బ్రౌన్ బేర్‌ను యతిగా వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం వీరి వాదనను కొట్టిపడేస్తున్నారు. అవి యతి అడుగులేనని అంటున్నారు. నిజంగా వారు చెప్పినట్టు బ్రౌన్ బేర్ అడుగులే అయితే ఓ క్రమ పద్ధతిలో అవి ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News