lawrence: నైజామ్ లో తగ్గని 'కాంచన 3' దూకుడు

  • ఈ నెల 19న విడుదలైన 'కాంచన 3'
  • బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లు
  •  నైజామ్ లో 4.60 కోట్ల షేర్   

లారెన్స్ కథానాయకుడిగా రూపొందిన 'కాంచన 3' ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు లేనప్పటికీ, అటు తమిళనాట .. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దూసుకుపోతోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఒక వైపున స్ట్రయిట్ చిత్రంగా 'జెర్సీ' గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ 'కాంచన 3' దూసుకుపోతూనే వుంది. బి - సి సెంటర్స్ లో ఈ సినిమా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది. ముఖ్యంగా నైజామ్ ఏరియాలో ఈ సినిమా ఇప్పటివరకూ 4.60 కోట్ల షేర్ ను రాబట్టి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతోంది. మాస్ ఆడియన్స్ ను మెప్పించే అంశాలు .. లారెన్స్ నటన .. వేదిక - ఓవియా .. నిక్కీ తంబోలి గ్లామర్ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News