nagababu: జీరో మనీ పాలిటిక్స్‌కి నాగబాబు కొత్త అర్థం.. ఎన్నికల్లో డబ్బులు పంచలేదట!

  • మాతో తిరిగిన కార్యకర్తల అవసరాలు తీర్చాం
  • పెట్రోలు కొట్టించాం.. భోజనాలు పెట్టాం
  • మై చానల్.. నా ఇష్టం ద్వారా చెప్పిన నాగబాబు

రాజకీయాల్లో ‘జీరో మనీ పాలిటిక్స్’కు జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు కొత్త భాష్యం చెప్పారు. తన సొంత యూట్యూబ్ చానల్ (మై చానల్ నా ఇష్టం) ద్వారా ఈ జీరో మనీ పాలిటిక్స్‌ గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో డబ్బులు పంచకూడదని అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు నాగబాబు తెలిపారు. డబ్బులు పంచకూడదు అంటే.. ఓటర్లకు పంచకూడదని అర్థమన్నారు. తమతోపాటు వచ్చిన కార్యకర్తలకు ఆహారం అందించడం, రాత్రి ఇంటికి వెళ్లడానికి పెట్రోలు ఖర్చులు వంటి వాటికి మాత్రం ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టలేదు కానీ కార్యకర్తల అవసరాలు తీర్చినట్టు తెలిపారు.

ఎంపీల అభ్యర్థులకు పార్టీ కొంత డబ్బు ఇస్తుందని, వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుందని నాగబాబు చెప్పుకొచ్చారు. తమకు ఇచ్చిన సొమ్మును ఖర్చుపెట్టకపోవడం జీరో మనీ పాలిటిక్స్ కిందికి రాదన్నారు. జనసేన తరపున ఆ డబ్బుతో తమతో తిరిగిన కార్యకర్తలకు భోజనాలు పెట్టామని, వారి అవసరాలు తీర్చామని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎంత ఖర్చు చేయాలో అదంతా తమతో తిరిగిన వారికే ఖర్చు చేసినట్టు చెప్పారు.  

More Telugu News