Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తప్పులు చేశానంటున్న రకుల్!
  • 'జాక్ పాట్' కొట్టిన సూర్య భార్య 
  • రానా సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి

*  తన కెరీర్ ఆరంభంలో కొన్ని పొరపాట్లు చేశానని అంటోంది అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్. 'అప్పట్లో నాకు ఏమీ తెలియదు, గైడ్ చేసే వాళ్లు కూడా లేరు, దాంతో కెరీర్ పరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. దానివల్ల కొంత నష్టపోయాను. అయితే, ఆ తప్పుల కారణంగా ఎంతో నేర్చుకున్నాను. తర్వాతి కాలంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను' అని చెప్పింది రకుల్.    
*  తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రధారిగా తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'జాక్ పాట్' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సూర్య తాజాగా వెల్లడించాడు.కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జ్యోతికతో పాటు రేవతి కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
*  రానా, సాయిపల్లవి జంటగా 'విరాట పర్వం 1992' పేరిట ఓ పిరీడ్ డ్రామా తెరకెక్కనుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సీనియర్ బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.

More Telugu News