paruchuri: అదే బాలసుబ్రహ్మణ్యం గొప్పతనం: పరుచూరి గోపాలకృష్ణ

  • బాలూ మాటల్లోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది
  •  నచ్చని పాటలు పాడనని చెప్పేవారు
  • 'మనో' పాడినదే ఉంచమని అన్నారు    

తెలుగు పాటకు పరుగును నేర్పిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎన్నోపాటలు ఆయన స్వరంలో నుంచి తేనె ధారలై కురిశాయి .. మరెన్నో పాటలు మనసు పొరల్లో అమరత్వాన్ని పొందాయి. అలాంటి మధురగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గురించి, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

 "చెన్నైలో మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో అద్దెకి వున్నప్పుడు, ఆయన కోసం బాలసుబ్రహ్మణ్యం వచ్చేవారు. ఆయన మాటల్లోనే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదనే విషయం అర్థమైపోతుంది. తనకి నచ్చని పాటలను ఆయన పాడేవారు కాదు .. 'వేరేవారితో పాడించండి' అని  సున్నితంగానే చెప్పేవారు. 'రేపటి స్వరాజ్యం' సినిమాకి నేనే దర్శకుడిని. ఆ సినిమాలో ఒక పాట కోసం 'మనోతో ట్రాక్ పాడించి, బాలూగారికోసం వెయిట్ చేస్తున్నాము. బాలూ వచ్చి ఆ పాట విన్నారు .. 'మనో చాలా బాగా పాడాడు .. ఆయన పాడినదే ఉంచండి' అని మనోను అభినందించి వెళ్లారు .. అంతటి గొప్ప మనసున్న గాయకుడు బాలూగారు' అని చెప్పుకొచ్చారు.

More Telugu News