yeti: హిమాలయాల్లో అంతుబట్టని పాదముద్రలు.. మరిన్ని ఫొటోల విడుదల!

  • మకాలు శిఖరం బేస్ క్యాంప్ వద్ద పాదముద్రలు
  • 32 x 15 ఇంచుల సైజులో పాదముద్రలు
  • మంచు మనిషి యతి పాదముద్రలనే అంచనా

భారత సైనికుల బృందం విడుదల చేసిన ఫొటోలు హిమాలయ పర్వత సాణువుల్లో 'యతి' అనే మంచు మనిషి ఉన్నాడనే వాదనను బలపరుస్తున్నాయి. మంచుకొండల్లో సాహసయాత్రకు వెళ్లిన సైనిక బృందానికి ఈ అంతుబట్టని పాదముద్రలు కనిపించాయి. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో మకాలు శిఖరం బేస్ క్యాంప్ కు సమీపంలో ఈ పాదముద్రలను వారు గుర్తించారు. ఈ పాదముద్రల పొడవు 32 ఇంచులు కాగా, వెడల్పు 15 ఇంచులుగా ఉంది. ఈ పాదముద్రలు యతివేనని భావిస్తున్నారు. పాదముద్రలకు సంబంధించిన మరిన్న ఫొటోలను ఆర్మీ సోర్సెస్ విడుదల చేశాయి. ఫొటోలు చూడండి.

More Telugu News