dil raju: మహేశ్ 26వ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు?

  • మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు  

మహేశ్ బాబు 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మహర్షి' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నాడు. ప్రస్తుతం లొకేషన్లు ఎంపిక చేసే పనిలో అనిల్ రావిపూడి వున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు - అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు.

అనిల్ సుంకరకి మహేశ్ ఒక సినిమా చేసిపెట్టవలసి వుంది. ఇక అనిల్ రావిపూడితో గల సాన్నిహిత్యం కారణంగా దిల్ రాజు కూడా రంగంలోకి దిగాడు. అలా ఈ ఇద్దరి నిర్మాణంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలేమిటనేది తెలియాల్సి వుంది. అనిల్ సుంకర ఈ సినిమాకి సోలో నిర్మాతగా వ్యవహరిస్తాడన్నమాట. 

More Telugu News