avengers endgame: 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్'

  • అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం
  •  అతి తక్కువ సమయంలో 200కోట్లకి పైగా వసూళ్లు
  •  350 కోట్ల మార్క్ చేరుకునే ఛాన్స్

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వెండితెరపై అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు ప్రయోగాత్మకంగా రూపొందుతూ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ నెల 26వ తేదీన ఇండియాలో విడుదలైన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' .. వసూళ్ల పరంగా సంచలనాలను నమోదు చేస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 200ల కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 4 రోజుల్లో 224.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా విశ్లేషకులను సైతం విస్మయులను చేస్తోంది. ఇండియాలో అతి తక్కువ సమయంలో 200 కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి'.. '2.0' సినిమాల జాబితాలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్'కూడా చోటు సంపాదించుకుంది. ఇండియాలో ఫుల్ రన్ లో ఈ సినిమా 350 కోట్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

More Telugu News